Breaking News

వచ్చే రెండు మూడు వారాల్లో పెండింగ్ లేఔట్ల ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందిస్తాం

-శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో గౌ. ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే రెండు మూడు వారాల్లో పెండింగ్ వాటిని పరిష్కరించి లేఔట్లకు సంబంధించి పేపర్ మీద ఏర్పాటు, ప్లాటింగ్ చేసి ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందిస్తామని, శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి నియోజకవర్గం శెట్టిపల్లి గ్రామ పెండింగ్ భూసమస్యలపై కలెక్టర్ జెసి శుభం బన్సల్, విసి తుడా శ్రీమతి ఎన్. మౌర్య, ఆర్డీవో తిరుపతి రామ్మోహన్ తదితర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ పెండింగ్ ప్రొసీడింగ్స్ ను మంగళవారం నాటికి ఇచ్చేలా ఆర్డీవో తిరుపతి వారు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వరాదని ఆదేశించారు. అలాగే సదరు భూముల పేపర్ ఫ్లాటింగ్, రహదారుల ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పన కొరకు తుడా మూడు వారాల లోపు ప్రణాళికా చర్యలు చేపట్టి పురోగతి చూపాలని సూచించారు. అలాగే అధికారికంగా పేపర్ మీద లేఔట్ ప్లానింగ్ చేసి ప్లాట్లను లబ్ధిదారులకు చూపడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు.

ఈ సమావేశంలో తుడా సిపిఓ దేవి కుమారి, ఎస్డిసీ తుడా అధికారిణి (భూసేకరణ) సృజన తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *