Breaking News

ఆం.ప్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కి ఘనస్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారికి ఘనస్వాగతం లభించింది. జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి థర్డ్ ఎడిజే జస్టిస్ ఎం. గుర్నాథ్, ప్రోటోకాల్ జడ్జి కోటేశ్వర రావు, కోర్టు సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, తిరుపతి బార్ కౌన్సీల్ సభ్యులు తదితరులు గౌ. ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన వారిలో వున్నారు. హై కోర్టు సీజే వెంట చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ ఫోలియో హై కోర్టు జడ్జి కృష్ణ మోహన్, హై కోర్టు జడ్జి టి.సి.డి శేఖర్ కూడా ఉన్నారు. స్వల్ప విశ్రాంతి అనంతరం ఆం.ప్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోడ్డు మార్గాన మదనపల్లె కు బయల్దేరి వెళ్ళారు. వారు రేపు మదనపల్లె, పలమనేరు కోర్టు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *