Breaking News

గుణదల మేరీ మాత ఉత్సవాల బందోబస్తును పర్యవేక్షిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు నుండి విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీమాత ఉత్సవాలకు పోలీస్ కమిషనర్  ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్  ఆధ్వర్యంలో ప్రజల భద్రత మరియు శ్రేయస్య లక్ష్యంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నగర పోలీస్ కమిషనర్ గారు గుణదల మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించి బందోబస్త్ విధులు నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు మరియు సలహాలను అందించారు. అనంతరం గుణదల టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ మినీ కమాండ్ కంట్రోల్ నుండి సీసీ కెమెరాల ద్వారా మరియు డ్రోన్ కెమెరాల ద్వారా పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడ సిబ్బందికి అధికారులకు తగు సూచనలు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ…… ఉత్సవాలకు వచ్చే భక్తుల దర్శనం ప్రయాణం సులభతరం చేసి వారికి దివ్య అనుభూతి కలిగించడమే లక్ష్యంగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్లతో ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశామని, పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రింది సిబ్బందికి సూచనలిస్తూ విధులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటూ భక్తులందరికీ ఇబ్బందులు లేని ప్రశాంతమైన వాతావరణంలో మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు డిసిపి శ్రీ గౌతమి షాలి ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ మనిషా, ఏడీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *