Breaking News

పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

-పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షించారు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెరుగైన వైద్యానికి, ఆరోగ్య భరోసాకు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ చిరునామాగా మారాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. విజయవాడ డోర్నకల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స యాదవ్, బీజేపీ సీనియర్ నేత, కైకలూరు శాశన సభ్యులు కామినేని శ్రీనివాస్ గారితో కలిసి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకొచ్చిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ వారు దినదినాభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. మనుష్య మానవ రూపేణా అనే సూక్తిని సాక్షాత్కరించేలా వైద్యం కోసం వచ్చే వారికి వైదులు అభయం ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర గారు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *