-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా అమలు చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రతి సర్కిల్ లో, సర్కిల్ పరిధిలో గల వినియోగదారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేయగా, మంగళవారం విజయవాడ నగర పాలక సంస్థ మూడు సర్కిల్ కార్యాలయాల్లో, జోనల్ కమిషనర్లు వినియోగదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అందులో భాగంగా సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అమ్మకాల హోల్సేలర్లు, రిటైలర్లు, హోటల్ , క్యాటరింగ్, కర్రీ పాయింట్ , బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాప్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎన్ జి ఓ స్, స్వయం సహాయక బృందాల, సభ్యులందరితో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం మరియు అమ్మకం దాని వల్ల వచ్చు అనర్ధాలు, అనారోగ్య సమస్యలు వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చట్ట ప్రకారం 120 మైక్రోన్స్ పరిమాణం కన్నా తక్కువ పరిమాణం గల సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్మకం మరియు వాడకం నిషేధమని, అయినట్టును సింగల్ యూస్ ప్లాస్టిక్ అమ్మకాలు చేసిన, వినియోగించిన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకానికి ప్రత్యామ్నాయంగా వాడాల్సిన వస్తువులు, పర్యావరణం హితంగా ఉండే పదార్థాలతో తయారు చేయబడిన వస్తువుల వాడకాన్ని వారికి తెలిపారు
ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, గోపీనాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, శానిటరీ సూపర్వైజర్లు శివరాంప్రసాద్, ఓబేశ్వరరావు సలీం అహ్మద్, సోమరాజు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News