Breaking News

ఈ నెల 12 నుండి 14వ తేదీలోపు నమస్తే పధకంలో నమోదు చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 12 నుండి 14వ తేదీలోపు నమస్తే పధకంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్, భూగర్భ డ్రైనేజి కార్మికులు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వాలు అందించే సంక్షేమ పధకాలు అందించడానికి వీలు కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నమస్తే ప్రొఫైలింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని, వివరాలకు 9505378036 (ఎస్ఎస్ టీం) కు సంప్రదించవచ్చన్నారు. నిర్దేశిత అనుమతులు, పర్యవేక్షణ లేకుండా భూగర్భ డ్రైనేజీలోకి ప్రవేశించడానికి శిక్షణ లేని వ్యక్తులను నియమించడం చట్ట విరుద్ధమని, అటువంటి కార్మికులను నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థపైన భారీ జరిమానా విధించబడునని స్పష్టం చేశారు. కావున ప్రతి సెప్టిక్ ట్యాంక్, భూగర్భ డ్రైనేజీ కార్మికులు తప్పనిసరిగా నమస్తే పథకంలో నమోదు చేయించుకుని ప్రభుత్వాలు అందించే పలు ప్రయోజనాలు పొందాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *