-జిల్లా ప్రారంభ జోక్యం (డి ఈ ఐ సి) కేంద్రాలు ఏర్పాటు
-డోర్ టూ డోర్ కాంపెయిన్ ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు
-దివ్యాంగులు పిల్లలను గుర్తించడం జరుగుతుంది
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మన సమాజంలో పిల్లలకి ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు “జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు” ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ దిశలో గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఈఐసి సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎం అండ్ హెచ్ ఓ, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, మండల సెక్రటరీ వారందరితో కలిపి ఒక టీం గా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాకు ఈ టీములను పర్యవేక్షణ నిమిత్తం పంపి వారి ద్వారా అక్కడ ఎవరైనా దివ్యాంగులు పిల్లలు ఉన్నట్లయితే సంబంధించిన వ్యక్తుల సమాచారాన్ని వెంటనే తెలుసుకొని తక్షణ చర్యలు చేపట్టడం దివ్యాంగులు పిల్లలు గుర్తించడం జరుగుతుందని ఆమె అన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. డిస్టిక్ లీగల్ అథారిటీ సొసైటీ క్రింద ఉన్న తూర్పుగోదావరి కోనసీమ అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలలో నమోదైన కేసులు రిఫరెన్స్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న డిఈఐసి కేంద్రాన్ని సందర్శించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఎవరైనా తల్లిదండ్రులు చిన్నారులను, దివ్యాంగులను ఇంటి వద్దనే ఉంచుకొని పనికి వెళ్లే తల్లిదండ్రులను గుర్తించి అట్టివారిని తాము ప్రభుత్వ వాహనాలలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయవలసినదిగా ఆమె అన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా సూచించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చిన్నారుల వైద్య సేవలు అందించే విభాగాన్ని సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారితో సమయాన్ని పంచుకున్నారు. వైద్య అధికారులు, సిబ్బంది తో సమీక్ష నిర్వహించి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి(ఇన్చార్జి) ఎస్.కె. జానీ భాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి , డి. ఇ. ఐ. సి ప్రోగ్రాం ఆఫీసర్ డా .డి. హరి చంద్రప్రసాద్ , పిల్లల వైద్యురాలు డా. ఇంద్రజ , డి. ఇ. ఐ. సి. గవర్నమెంటు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News