Breaking News

హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ కార్యక్రమము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“జాతీయ ఎయిడ్స్ నియంత్రణ” కార్యక్రమములో భాగంగా మంగళవారం “జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ” జైళ్ల శాఖ ఆద్వర్యంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ (HSS Plus) అనే కార్యక్రమమును ప్రారంభించుట జరిగినది. ఈ హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ లో భాగముగా కేంద్ర కారాగారంలో ఉన్న ఎంపిక చేసిన 400 ఖైదీలకు (రోజుకు 20 కి మించకుండా) హెచ్.ఐ.వి, సిఫిలిస్, హెపిటైటిస్-బి & సి పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలను సేకరించి మైక్రోబయాలజీ విభాగం రంగరాయ వైద్య కళశాల, కాకినాడకు పరీక్షలు నిమిత్తం పంపించుట జరగుతుంది. ఈ సందర్భంగా పి. బాలాజీ, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, ఈస్ట్ గోదావరి మరియు ఏలూరు జిల్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమము ద్వారా జైళ్ళలో ఉన్న ఖైదీలలో ఎంత శాతం హెచ్.ఐ.వి సిఫిలిస్, హెపిటైటిస్-బి & సి వ్యాధులు ఉన్నావో తెలుసుకోవడం మరియు తద్వారా ఆ వ్యాధుల నివారణ కొరకు తీసుకోవలసిన చర్యలు, వాటి ప్రణాళికలు రూపొందించేందుకు ఎంతగానో ఈ కార్యక్రమము ఉపయోగపడుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమము మార్చి నెలాఖరు వరకు నిర్వహిస్తారని యస్. రాహుల్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం వారు తెలియజేశారు, అనంతరం ఎంపిక చేయబడ్డ ఖైదీల నుండి రక్త నమూనాలను సేకరించడం జరిగినది.

ఈ కార్యక్రమములో యం. రాజ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్, డా. కోమల, వైద్యాధికారిణి, బుజ్జి బాబు, జిల్లా సూపర్వైసర్, గంగ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, ఏ. అనిల్, కౌన్సిలర్, బి. దుర్గా ప్రసాధ, ప్రాజెక్టు కొ-ఆర్డినేటర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *