-మన ప్రవర్తన చాలా ముఖ్యం
-మనం ప్రజల సేవకులం అనే భావనతోనే సత్ఫలితాలొస్తాయి
-పింఛన్లు పంపిణీ చేస్తున్నా కొందరి ప్రవర్తనతో చెడ్డపేరు
-కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపిగ్గా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సచివాలయంలో పబ్లిక్ పెర్‌సెప్షన్‌పై సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపైన సీఎం స్పందిస్తూ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రజలతో ప్రవర్తించే తీరు వల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు. పింఛన్లు పంపిణీకి మనం రెండు రోజులు సమయం పెట్టుకున్నామని, అయితే పింఛన్ల పంపిణీలో కొంతమంది లబ్దిదారులతో దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని, దీనివల్ల మనం మంచి చేస్తున్నా ప్రజల్లో చెడ్డపేరు వచ్చే అవకాశముందన్నారు. ముందు మన ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. మనందరం ప్రజలకు జావాబుదారీ అనేది గుర్తుంచుకోవాలని తెలిపారు. మన ప్రలకు సేవ చేయడానికున్నామనే భావన మనలో ఉన్నప్పుడు ప్రజలతో మనం ప్రవర్తించేర తీరు ఒకలా ఉంటుందని, అలా కాకుండా ఇక్కడ నాదే పెత్తనం అనే ధోరణితో ఉంటే మన ప్రవర్తన, సమస్యల పరిష్కరించే తీరే భిన్నంగా ఉంటుందన్నారు. మన వద్దకు వచ్చిన వారు తెచ్చిన సమస్యల్లో కొన్ని మనం పరిష్కరించేవి ఉంటాయి, కొన్ని మనం పరిష్కరించలేనివి కూడా ఉంటాయి, అయితే వాటిన్నిటికంటే ముందు ముందు ప్రజలు మన వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, వారి సమస్యలను ఓపిగ్గా వినడం ప్రధానమన్నారు. అధికారుల పనితీరు అంచనా వేయడంలో వారి ప్రవర్తన కూడా చాలా కీలకంగా ఉంటుందని, దీన్ని గుర్తుంచుకుని అందరూ పనిచేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తిని మదింపు వేయడానికి ఒక వినూత్న పద్దతిని అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బిగ్ డేటా వచ్చాక ఏ ఫంక్షనరీ ఏ విధంగా పని చేస్తున్నారని, లోపాలు ఎక్కడున్నాయనేది మనకు ఒక అంచనా వస్తుందన్నారు. మనందరం ప్రజలకు జవాబుదారి అనేది గుర్తుంచుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News