Breaking News

నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించండి

-ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలి
-వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియే స్పెషల్ సిఎస్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వాటి ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రులు మరియు కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం జనవరి మాసంతానికి సాధించిన ప్రగతి మరియు మిగిలిన రెండు మాసాల్లో అమలుపరచాల్సిన కార్యాచరణ ప్రణాళికలను ఆ శాఖ ఎక్స్ అఫిషియే స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. నకిలీ విత్తనాల సమస్య జఠినలంగా మారిందని, వాటి నియంత్ర్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని వ్యవసాయ శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రాగా ఆయన తీవ్రంగా స్పందించారు. మర్కెట్ లో నకిలీ విత్తనాలను విక్రయించే వారిని గుర్తించి వారి లైసెన్సు రద్దు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు.
ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇప్పటికే నిర్థేశించుకున్న 20 శాతం వృద్ది రేటును సాదించే విధంగా ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు గరిష్ట స్థాయిలో ఆదాయం వచ్చే ఉద్యాన వన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, దేశ విదేశాల్లో ఇప్పటికే సాగు చేస్తున్న మిక్కిలి శ్రేష్టమైన పంటలను గుర్తించి, ఆయా పంటలను రైతులు సాగుచేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. అదే విధంగా పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రాధాన్యత రకాలైన ధాన్యాన్నే పడించే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆయా ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. బిందు సేద్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే విధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు, గొర్రెల పెంపకందారుల జీవనోపాధిని మెరుగు పర్చే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్దంగా ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచర్య ప్రణాళికలను రూపొందించి అమలు పర్చాలని ఆదేశించారు. గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఏప్రిల్ లో మత్య్సకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు అదే విధంగా రైతులకు రైతు భరోసా అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *