-ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రహదారి భద్రత పై ప్రచారం నిర్వహిస్తున్నాం
-జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భం గా గురువారం కార్లు, ఆటో లు, మోటార్ సైకిళ్ళుతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీ
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్ర త్తలు తప్పనిసరిగా పాటించాలని, భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాలను కలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు అన్నారు.
గురువారం ఉదయం ఆర్ట్స్ కళాశాల ఆవరణ లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సంద ర్భంగా కార్లు, ఆటో లు, మోటార్ సైకిళ్ళుతో కూడి న కంబైన్డ్ వాహనాలతో ర్యాలీ ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, అడిషనల్ ఎ స్పీ, ఏవి సుబ్బారావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తో కలిసి ప్రారంభించా రు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించక పో వడం, ట్రాఫిక్ రూల్స్ పాటించ కపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రవాణాశాఖ గత నెల జనవరి నెల నుండి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగ్గా పాటించాలన్నారు.
ద్విచక్రవాహనం నడిపేటపుడు హెల్మెట్, కారు నడిపేటపుడు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధన లు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన ప్రయాణ సమయం లో చేసే చిన్న పొరపాటు వల్ల మీతోపాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ వాహన ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమా లు రూపొంది స్తోందని అన్నా రు. ప్రజల్లో చైతన్యం రావాలనే అవగాహన ర్యాలీలు ఏర్పా టు చేసినట్లు, అందరీనీ కలుపుకుని ముందుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. మితిమీరిన వేగం తో, వాహనాల్లో నిర్దేశించుకున్న సంఖ్య కంటే ఎక్కువ గా మితిమీరిన ప్రయాణికులతో ప్రయాణించడం చట్టరిత్యా నేరం అన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే ఎటువంటి నష్ట పరిహారం కూడా అందే అవకాశం లేదని, మనం ఇంటి వద్ద బయలుదేరే సమయంలో తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి భద్రత నిబంధనలు ఖచ్చితం గా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ సిహెచ్. సంపత్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర రావు, అసిస్టెంట్ మోటార్ వెహిక ల్ ఇన్స్పెక్టర్స్, జి రాధికా దేవి, పి. వి. వి. డి. సాయి కుమార్, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ పి.మాధురి , పెద్ద ఎత్తున ద్వి చక్ర వాహనదారులు, క్యాబ్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News