Breaking News

ఆటోన‌గ‌ర్ కి పున‌ర్వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు కలిసి కృషి చేద్దాం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ పారిశ్రామికవేత్త‌ల‌తో స‌మావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోన‌గ‌ర్ లోని ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీకి పూర్వవైభ‌వం తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండ‌స్ట్రీ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వన్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) గురువారం స‌మావేశం అయ్యారు. ఆటోన‌గర్ లోని ఆటో మొబైల్ రంగంలో ఉపాది పొందుతున్న ల‌క్ష‌మంది వ‌ర్క‌ర్స్ మారిన టెక్నాల‌జీకి అనుగుణంగా నైపుణ్య ప‌రంగా అప్ గ్రేడ్ చేయాలంటే ఏలాంటి వ‌సతులు, సుదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు.

అలాగే యువ‌తకు ఉద్యోగావ‌కాశాలు, ఆటోమొబైల్ రంగంలో వ్యాపార అవ‌కాశాలు అబివృద్ది చెంద‌టానికి పారిశ్రామిక వేత్త‌ల నుంచి సూచ‌న‌లు తీసుకున్నారు. ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీయ‌ల్ లో మారిన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని అప్ గ్రేడ్ అయ్యేందుకు ఆటోన‌గ‌ర్ లో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ ను ఏర్పాటు చెప్పిస్తాన‌న్నారు. ఆటోన‌గ‌ర్ పూర్వ‌వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు, పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు క‌లిసి ప‌నిచేద్దామ‌న్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో యువ‌త‌కు ల‌క్ష‌ల ఉద్యోగావ‌కాశాల క‌ల్ప‌నే ధ్యేయంగా ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండ‌స్ట్రీ అసోసియేష‌న్ స‌హ‌కారం అందించాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు.

ఈ స‌మావేశంలో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండ‌స్ట్రీస్ అసోసియేష‌న్ ప్రెసిండెంట్ బాయన వెంకట రావు, ప్రెసిడెంట్ దోనేపూడి దుర్గాప్ర‌సాద్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎమ్.ఎస్.దుర్గా ప్ర‌సాద్, మాజీ ప్రెసిడెంట్ డాక్ట‌ర్.దాస‌రి రామ‌కృష్ణ‌, ఇండస్ట్రీయ‌ల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ అసోసియేష‌న్ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ ర‌మేష్, ఇండ‌స్ట్రీయ‌ల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ టి.నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఐలా ప్రెసిడెంట్ సుంక‌ర దుర్గా ప్ర‌సాద్, జె.ఆర్.డి టాటా ఇండ‌స్ట్రీస్ ఎస్టేట్ సోసైటీ చైర్మ‌న్ వినోద్ బాబు, ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ మాజీ జ‌న‌ర‌ల్ సెక‌ట్ర‌రీ ఎమ్.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌, ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ మాజీ జ‌న‌ర‌ల్ సెక‌ట్ర‌రీ గ‌ద్దె సాంబ‌శివ‌రావు, జె.ఆర్.డి టాటా ఇండ‌స్ట్రీస్ ఎస్టేట్ ఐలా సోసైటీ సెక్ర‌ట‌రీ తాడిశెట్టి శ్రీనివాస‌రావు, వేమూరి సామ్రాట్ కుమార్ ల‌తో పాటు ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండ‌స్ట్రీస్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *