Breaking News

యోగ శక్తి చికిత్స నాడీ శోధనతో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ… : డా. మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడీ శోధనతో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ చేయడం మంచి ఫలితాలు సాధించవచ్చునని యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ మాకాల సత్యనారాయణ తెలిపారు. మనలో నాడీ అనేది సృష్టికర్త ద్వారా మనలో ఏర్పాటు చేయబడి మన 12 అవయవాల పనితీరులో హెచ్చుతగ్గులు కనిపెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే విధానం భారతదేశం లో వేల సంవత్సరాలుగా వాడబడినది అని దీనిని యోగ, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలో వాడుతున్నారని చెప్పారు. నాడీ ద్వారా ప్రాణశక్తి స్థాయిని గుర్తించవచ్చునని, ఉన్న ఆరోగ్య సమస్యలను, రాబోయే సమస్యలను గుర్తించి ఆరోగ్యం, ఆనందం మరియు పూర్ణ ఆయుష్షులు కలిగేలాగా ప్రాణ శక్తి పెరిగేలాగా చేయటానికి నాడీ శోధన ఉపయోగం అని డాక్టర్‌ మాకాల సత్యనారాయణ తెలిపారు. 18-2-2025 మంగళవారం ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు అశోక్‌నగర్‌, కానూరులో గల ఇండియన్‌ హోం కేంద్ర కార్యాలయం వద్ద నాడీ శోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొనదలచినవారు సెల్‌ నెంబర్‌ 9000347369కు తెలిపి పేరు నమోదు చేసుకోవలసినదిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *