విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని శ్రీ భవానీ హాస్పిటల్‌నందు ఉచిత వైద్య శిబిరం జరిగింది. శనివారం నాగార్జునవీధి, స్వాతి సినిమా హాల్ దగ్గర, భవానీపురం, విజయవాడలోని శ్రీ భవానీ హాస్పిటల్‌నందు ఉచిత వైద్య శిబిరం జరిగిన సందర్భంగా నిర్వాహకులు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలోని చుట్టుప్రక్కల ప్రాంతాలలో, గ్రామాలలో పలు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని అలాగే నగరంలోని పేద, మధ్య తరగతి వారి కోసం శ్రీ భవానీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ది. 15-02-2025 నుండి ది. 25-02-2025 వరకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉత్తమ వైద్యనిపుణులతో రూ. 2 వేలు విలువగలిగిన రక్తపరీక్షలు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పిపిబిఎస్, హెచ్‌బిఎ1సి, ఈసీజీ, క్రియాటినీ పరీక్ష, అవసరమున్న వారికి ఉచితంగా ఎక్స్‌రే, ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా చేయబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులుతోపాటు ఇతర పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలలో భాగంగా పేద, మధ్య తరగతి వారి కోసం తమ హాస్పిటల్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చేస్తున్న కృషిని స్పూర్తిగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఉచితంగా మరిన్ని వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అనంతరం ఇక నుండి తమ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్వహించనున్న మరిన్ని ఉచిత సేవలు, ఉచిత ఆపరేషన్లను గురించి బ్రోచర్ ఆవిష్కరణను ఆవిష్కరించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్ని వైద్యసేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరికిరి శివరామకృష్ణ, డాక్టర్ జి.పి.వి.సుబ్బయ్య, డాక్టర్ ఎన్.పి.దిలీప్‌కుమార్, కసినిబోయిన భారతి, ఎన్.భావన్నారాయణ, సిహెచ్.వెంకట్, పోలవరపు రాజేష్ వివిధ విభాగాల డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News