Breaking News

నగరంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. శనివారం విజయవాడ గాంధీనగర్ లో వున్న ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ముందుగా జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి చేత రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడిన బందెల గౌతమ్ కుమార్ ని, రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నియమించబడిన బి.పరం జ్యోతిని రాష్ట్ర నాయకులు శాలువాలు కప్పి అభినందనలు తెలియచేసారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన బి. ఎస్. పి జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయా వతికి, అందుకు సహకరించిన జాతీయ కో ఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ కి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర ఇంచార్జి రాంజీ గౌతమ్కి ధన్యవాదములు తెలిపారు. అలాగే, బహుజన మహా పురుషులు ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం ఆశయాల సాధన కోసం పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్ట డమే లక్ష్యం గా పార్టీ శ్రేణులను సమాయాత్తం చేస్తానని, అలాగే, పార్టీ కార్యకర్తలకు ఒక రక్షణ కవచంగా నిలబడుతానని, పార్టీలో పెద్దల సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధిస్తాం అని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌతమ్ కుమార్ తెలిపారు. సెంట్రల్ కో ఆర్డినేటర్ బాలయ్య, రాష్ట్ర కో ఆర్డినేటర్ లు జె.పూర్ణ చంద్రరావు, మరో కో ఆర్డినేటర్ పరంజ్యోతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులగణన కొరకు మా పార్టీ పోరాడుతుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, నూతన అధ్యక్షులు గౌతమ్ కుమార్ సారద్యంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమవంతు కృషి, సహకారం అందిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లకే రాజారావు, వందన్ కుమార్, బచ్చలకూర పుష్పరాజు, మల్లికల్, చిత్ర సేను, గురప్ప, తిరుపతి రావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *