Breaking News

బండ బూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారు…

-టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మాజీ సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్షహోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై పాతబస్తీలోని ఆయన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు. ఎక్స్ లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్ట్ పెట్టారని మండిపడ్డారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ఆరోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని విమర్శించారు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. జగన్ అధికారాన్ని చూసి విర్రవీగిన వారంతా తప్పకుండా ఊచలు లెక్కిస్తారని హెచ్చరించారు. నారా లోకేష్ తన పాదయాత్రలోనే రెడ్ బుక్ ద్వారా చెప్పారని.. నాడు నోటి దూల తీర్చుకున్న వారికి నేడు చట్టపరంగా దూల తీరుస్తామని ప్రకటించారన్నారు. ఇప్పుడు చేసిన తప్పులకు అరెస్టులు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారన్నారన్నారు. కళ్లు మూసుకుపోయి, అధికార మదంతో మదమెక్కి వాగారని విరుచుకుపడ్డారు. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రోజా వంటి వారితో ట్రైనింగ్ ఇచ్చి జగనే మాట్లాడించారని ఆరోపించారు. వీరందరూ కూడా త్వరలో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనన్నారు. జగనే స్వయంగా తనకు 40 నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించాడని విజయసాయిరెడ్డి చెప్పారన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని జగన్ ఇంట్లో ఆడవాళ్లను తిట్టించారని మండిపడ్డారు. అదే మా అధినేత చంద్రబాబు మమ్మలను నోరు జారితే ఊరుకోరన్నారు. వంశీ, కొడాలి నానితో మాట్లాడించిన  జగన్ కు రాజకీయంగా చరిత్ర ముగిసింది అని, ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లు ఇచ్చారని, ఈసారి అవి కూడా ఇవ్వరని జోశ్యం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *