– బుడితి రాజశేఖర్ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం & సహకారం)
-రోజుకు రైతుల నమోదు లక్ష్యం 2 లక్షలు దాటాలి
-రెవెన్యూ అధికారుల లాగిన్ లలోని పెండింగ్ రికార్డులను సత్వరమే పరిష్కరించాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ లు ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు క్షుణ్ణంగా పర్యవేక్షించాలి .
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం బుడితి రాజశేఖర్ ఐఏఎస్, ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ( వ్యవసాయ & సహకారం) రాష్ట్రములోని వివిధ జిల్లాల సంయుక్త కలెక్టర్ లు ,జిల్లా వ్యవసాయ ,ఉద్యాన శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు శ్రీ డిల్లీ రావు ఐఏఎస్ మరియు ఉద్యాన సంచాలకులు శ్రీనివాస రావు ఐఏఎస్ పాల్గొన్నారు .
మొదటగా రాజశేఖర్ మాట్లాడుతూ,మన రాష్ట్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ లో రైతుల నమోదు ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేసుకుని
ప్రత్యేక క్లెయిమ్ కొరకు కేంద్ర ప్రభుత్వంనకు నివేదిక పంపవలసిన నేపథ్యంలో ,వ్యవసాయ ,ఉద్యాన మరియు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి సమన్వయంతో రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసుకుంటూ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు .
ప్రస్తుతం ఈ ప్రక్రియ లో రోజుకు నమోదు అవుతున్న సుమారుగా 2 లక్షల రైతుల సంఖ్య ను మరింత పెంచవలసినదిగా కోరారు. రెవెన్యూ అధికారుల లాగిన్ లలో పెండింగ్ లో వున్న రికార్డులను తక్షణమే పరిష్కరించవలసిందిగా ఆదేశించారు .వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుంటూ గడువు లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలియ చేసారు .
పీఎం కిసాన్ పధకము నకు 2025 -26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు వారి అకౌంట్ లలో డబ్బుల జమకు ఫార్మర్ ఐడి – విశిష్ట సంఖ్య తప్పనిసరి చేసారు అని , కాబట్టి యంత్రాంగం పీఎం కిసాన్ లబ్దిదారులను ముందుగా నమోదు చేయించాలని ,ఈ నమోదు ద్వారానే వారికి అర్హత వచ్చి పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయని తెలిపారు .
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ లక్ష్యం గడువు లోపు చేరుకోవటానికి జిల్లా సంయుక్త కలెక్టర్లు పూర్తి స్థాయిలో క్రమం తప్పకుండా నిరంతరముగా రోజు వారి పర్యవేక్షణ అత్యంత అవసరమని తెలిపారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ లు మాట్లాడుతూ కొన్ని సాంకేతిక సమస్యలు ముఖ్యముగా E SIGN SERVOR (ఈ సైన్ సర్వర్) మొరాయిస్తున్నదని ,కొన్ని భూముల రికార్డులు కనపడుట లేదని తెలిపారు .వాటిపై డిల్లీ రావు గారు మాట్లాడుతూ ఈ విషయమై కేంద్ర సాంకే తక అధికారులతో సంప్రదిం చామని,సోమవారానికి సమస్య పరిష్కారం అవుతుంది అని తెలిపారు .
Prajavartha Online Telugu News