-ఈ నెల 17న (నేడు) ముఖ్యమంత్రి తిరుపతి పట్టణం నందు టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ 2025 కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జెసి శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న (నేడు) తిరుపతి పట్టణం నందు టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ 2025 కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం ఉండరాదని అధికారులను జెసి శుభం బన్సల్, ఎస్పి హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై రేణిగుంట విమానాశ్రయం నందు ఎఎస్ఎల్ లో భాగంగా సమీక్షించిన ఎస్పీ, జెసి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అందరూ అధికారులు అప్రమత్తంగా నిర్వహించాలి అని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితరాల ఏర్పాటు పై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం జెసి, ఎస్పీ సిఎం గారు సదస్సులో పాల్గొనే ఆశా కన్వెన్షన్ సెంటర్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కన్వెన్షన్ సెంటర్ నందు తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్య తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ హేమంత్, ఏఎస్పీ లు శ్రీనివాస రావు, రవి మనోహారాచారి, ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.