Breaking News

రీసర్వే పై తనిఖీ…

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సంయుక్త కలెక్టరు A భార్గవ్ తేజ, I.A.S., వారు రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో జరుగుచ్చన్న రీసర్వే గ్రామాలలో రీసర్వే ఏ విదముగా చేయుచున్నారో అని తనిఖీ చేయు నిమిత్తం సోమవారం ఆకస్మికముగా గుంటూరు తూర్పు మండలం, జొన్నలగడ్డ గ్రామము నందు జరుగుచున్న రీ సర్వే కార్యక్రమమును తనిఖీ చేసి యున్నారు.
తదుపరి రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దును పరిశీలించి యున్నారు. మరియు గ్రౌండ్ ట్రుతింగ్ కార్యక్రమమునకు హాజరైన రైతులతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపటమును మరియు ఓఆర్ఐ షీట్లను పరిశీలించి ఉన్నారు. తదుపరి జొన్నలగడ్డ గ్రామ సచివాలయమును సందర్శించి అక్కడ రీసర్వే కార్యక్రమములో భాగమైన వెక్టరైజేషన్ ను QGIS సాఫ్ట్ వేర్ లో పరిసీలించియున్నారు, మరియు పీజిఆర్ఎస్,రెవిన్యూ సదస్సు నందు వచ్చిన అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నారో అని పరిశీలించారు. పరిష్కార విధానము, అర్జీదారునకు సంతృప్తి చెందు విదముగా వుండవలెనని జాయింట్ కలెక్టరు వారు సంబందిత అధికారులకు తెలియజేసినారు. తదుపరి సంబందిత గ్రామ సర్వేయర్లకు, గ్రామ రెవెన్యూ అధికారులకు రీసర్వే మీద తగు సూచనలు చేశారు మరియు సర్వే ప్రక్రియ త్వరితగతిన అయ్యేటట్లుగా ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయ వలసినదిగా ఆదేశించారు. ఈ కార్యక్రమమునకు జాయింట్ కలెక్టర్ గుంటూరు వారితో పాటు గుంటూరు తూర్పు మండల తహసిల్దారు వారు, సర్వే సహాయ సంచాలకులు (AD), డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, మండల సర్వేయరు, గ్రామ సర్వేయర్లు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *