
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బందర్ రోడ్ లో ‘కార్ల’ డైమండ్స్ షోరూంను సోమవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్లతో మంచి నాణ్యత గల డైమండ్స్ ఆభరణాలను అందించడం ద్వారా వారు ఈ రంగంలో విజయం సాధించారు అని అన్నారు. వివిధ రకాల నూతన ఆభరణాలను ప్రదర్శించారు. విజయవాడలో తమ రెండవ శాఖను ప్రారంభించారు. మా కఠినమైన ఎంపిక ప్రక్రియ, బాధ్యతాయుతమైన సోర్సింగ్ మరియు నైపుణ్యం పట్ల నిబద్ధత, చాలా జాగ్రత్తగా ఎంపిక చేయబడిన వజ్రాలు ఆభరణంలోకి వస్తాయని నిర్ధారిస్తుంది అని ఎన్ విద్యాధరరావు మరియు ఏ.మణికంఠ చెప్పారు. అనంతరం వి.హర్షవర్ధన్ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకమైన డైమండ్స్ 20000 రూపాయలు నుండి కార్ల డైమండ్స్ ఫర్ క్యారెట్ ప్రైస్ 49,999 అందు బాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నిర్వాహకులు కే నరసింహారావు, ఎస్ సంజీవ్, పలువురు నగర ప్రముఖులు, షోరూమ్ ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News