Breaking News

భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎకో సెన్సిటివ్ జోన్ లో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ లో మాస్టర్ ప్లాన్ రూపొందించడం పై మంగళవారం కలక్టరేట్ ఛాంబర్ లో అటవీ, రెవెన్యూ, పర్యావరణ ,పర్యాటక, పరిశ్రమలు ,పంచాయతీరాజ్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణ వైల్డ్ లైఫ్ సాంక్ష్యూరి పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని గ్రామాలలో పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులు సంబంధించి ఆయా శాఖలు మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. ఆయా శాఖలు అవసరాలకు అనుగుణంగా చేపట్టే అభివృద్ధి పనులకు ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ లో చేపట్టకూడనవి, అనుమతించేవి, నియంత్రణ కలిగిన వాటిపై ఆయా శాఖలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఆర్డిఓ కె.స్వాతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటకశాఖ అధికారి జి రామ లక్ష్మణరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *