Breaking News

పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య నిర్వహణ ఖచితంగా జరగాలని, ఎక్కడ వ్యర్ధాలు ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రభ కాలనీ, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ, కరకట్ట రోడ్, కండ్రిక, నూజివీడు రోడ్డు, వాంబే కాలనీ, తదితర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డుపై ఎటువంటి వ్యర్ధాలు ఉండరాదని, ఇంటింటి వ్యర్థల సేకరణ కచ్చితంగా జరగాలని, పుష్ కార్ట్ లలో కచ్చితంగా నాలుగు చెత్తబుట్టలను ఉంచాలని, తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, అధికారులను ఆదేశించారు.

ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ, పరిసర ప్రాంతాలన్నీ శానిటరీ ఇన్స్పెక్టర్ గోపిరాజు ద్విచక్ర వాహనంపై ఎక్కి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యర్ధాలను రోడ్డుపైన నిలువ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని. కాలువలో పూడికలను ఎప్పటికప్పుడు తీస్తూ నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటకం లేకుండా చూసుకోవాలని, నీటి ప్రవాహాన్ని ఆగినప్పుడు దోమలు ఉత్పత్తి అవుతాయని, దోమలను నియంత్రించటానికి కాలువలలో పూడికలను తీయటమే కాకుండా మలేరియా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతిరోజు ఫాగింగ్, యం ఎల్ ఆయిల్ స్ప్రే చేస్తూ, ప్రజలు దోమ కాటు వల్ల అనారోగ్యం పాలవకుండా చూసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *