Breaking News

సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై బల్క్ వేస్ట్ జనరేటర్స్ తో సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన రైతు బజార్, మార్కెట్, హాస్పిటల్స్, హోటల్స్ మానేజర్లతో మంగళవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్ధాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని అవి భూమిలో కలిసిపోవడానికి 200 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని. పర్యావరణహితమైన వస్తువులనే వాడాలని మార్కెట్ ప్రదేశాలలో రైతు బజార్లలో హాస్పిటల్లో ఎక్కడాను సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధించాలని దానికి బదులుగా పర్యావరణహితమైన వస్తువులను వాడేందుకు ప్రజలను చైతన్య పరచాలని. ఈ నెల ఆఖరు లోగా ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చ్ 1, 2025 నుండి సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రత్యేక రైడ్లు నిర్వహిస్తారని, ఎవరైనా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని వాడినచో అమ్మినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారీ జరిమానా విధిస్తారని, అమ్మేవారి ట్రేడ్ లైసెన్స్ లు క్యాన్సిల్ చేస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థలో గల రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్లు, మార్కెట్ మేనేజర్లు, హాస్పిటల్ మేనేజర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *