-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రజలందరినీ పాల్గొనమని పిలుపునిచ్చారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానాలు వచ్చాయని, దీనికి కారణమైన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సారి జరిగే స్వచ్ఛ సర్వేక్షన్లో కూడా పాల్గొని విజయవాడ ను ఉత్తమమైన స్థానంలో నిలపాలని ప్రజలను కోరారు.
ఈసారి నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ ఫీడబాక్ ను QR code ద్వారా స్కాన్ చేసి, ఫోన్ నెంబర్, OTP నమోదు చేసి, సర్వేలో ఉన్న పది ప్రశ్నలకు తమ అభిప్రాయాన్ని తెలియపరచి సర్వేని పూర్తి చేయవలసిందిగా ప్రజలను విన్నవించారు.
Prajavartha Online Telugu News