-ఖిద్మత్ ఘర్ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం, ప్రజలందరితోపాటు ఎన్డీయే కూటమి కోసం అహర్నిశలు పని చేస్తున్న కార్యకర్తలు ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారి ఆర్ధికంగా బలోపేతం కావటమే లక్ష్యంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కృషి చేస్తున్నారని ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సంకే విశ్వనాథం అన్నారు.
పశ్చిమనియోజకవర్గంలోని 53వ డివిజన్ పంజా సెంటర్ దగ్గర గణపతి రోడ్ లో గల ఖిద్మత్ ఘర్ కార్యాలయం లో మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాలపై ఎమ్.ఎస్.ఎస్.ఈ లోన్స్ పై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచి వినియోగించుకునేందుకు టిడిపి పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సంకే విశ్వనాథం మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ ఆదేశాలపై ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రతి డివిజన్ లో ఇలాంటి విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించి చెప్పటంతో పాటు , ప్రజలు పారిశ్రామికవేత్తలుగా మారటానికి బ్యాంక్ ల లోన్స్ విషయంలో పూర్తి సహాయ సహకారాలు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అందజేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రావూరి సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శి మధు, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, టిడిపి రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు ఆషా, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పాల మాధవ, మాజీ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున యాదవ్, టిడిపి నాయకులు ఇమ్రాన్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News