నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది మంగళవారంనందిగామ శాసనసభ్యురాలు విప్ తంగిరాల సౌమ్య ని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను ఏ విధంగా అబివృద్ధి చేయాలనే అంశం పై ఫిబ్రవరి 10 తేదీ నుండి 16వ తేదీ వరకు శిక్షణ పొందిన అనేక విషయాల గురించి వివరించారు. ఎన్ఐఆర్డి పిఆర్ లో జరుగుతున్న అంశాల గురించి సౌమ్య అడిగి తెలుసుకున్నారు .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వికసిత్ పంచాయతీ కార్యక్రమంలో మనందరినీ భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే మీరు నేర్చుకున్న విషయాలను గ్రామస్థాయిలో తీసుకెళ్లి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు విజన్ కు అనుగుణంగా వారు చెప్పినట్లు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంట్రపైనర్ గా గ్రామ ప్రజలను తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎనిమిది పంచాయితీ ఛాంపియన్స్ వీరులపాడు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు తో పాటు మండల నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా NIRD PR కోఆర్డినేటర్ జీవీ నరసింహారావు, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మార్కపుడి వర కుమార్ మరియు పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పూర్తి చేసుకున్న కేవీ నరసింహారావు, కట్ట సునీల్ ,యర్రంరెడ్డి ప్రదీప్ కుమార్ ,సింగి సురేష్ కుమార్, కొప్పుల రాము, జె సత్యనారాయణ,అవులదొడ్డి హనుమంతరావు, కె శ్రీనివాసరావు,మంచికంటి గోపి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News