Breaking News

పెట్టుబడుల వేటలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీలో జరుగనున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్
-రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలు వివరించి పెట్టుబడులు ఆహ్వానించునున్న మంత్రి దుర్గేష్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025 ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఎస్ఎటీటీఈ-2025 లో మంత్రి దుర్గేష్ వివరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానించమన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా 28 రాష్ట్రాలు, 50 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సమక్షంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగానికి కల్పించిన పరిశ్రమ హోదా, నూతన టూరిజం పాలసీ, రాష్ట్రంలో పర్యాటక రంగానికి అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు తదితర వివరాలను వివరించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *