Breaking News

ఈ నెల 19 నుంచి టెక్నిక‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సు ప‌రీక్ష‌లు

– డీఈవో యూవీ సుబ్బారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు టెక్నిక‌ల్ స‌ర్టిఫికేట్ కోర్సు (టీసీసీ-2025) ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. విజయ‌వాడ కొత్త‌పేట‌లోని ఎస్‌కేపీవీవీ హైస్కూల్ కేంద్రంలో ఉద‌యం 10 గం. నుంచి 12.30 గం. వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. డ్రాయింగ్, హ్యాండ్‌లూమ్ వీవింగ్, టైల‌రింగ్‌, ఎంబ్రాయిడ‌రీ విభాగాల్లో లోయ‌ర్‌, హ‌య్య‌ర్ కేట‌గిరీల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని డీఈవో వివ‌రించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *