Breaking News

మహిళా వర్సిటీ ఐటి, లైఫ్ సైన్సెస్ ల్యాబ్ లను పరిశీలించిన లోకేష్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఐటి, లైఫ్ సైన్సెస్ ల్యాబ్ లను రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధ్యాపకులు మంత్రి లోకేష్ కు వివరాలు తెలియజేస్తూ… తాము అతితక్కువ ఖర్చుతో డ్రోన్ పిసిబిలు తయారు చేస్తున్నామని చెప్పారు. 2.5 కి.మీ.ల రేంజిలో పనిచేసే అధునాతన డ్రోన్ ను తాము కేవలం రూ.5లక్షలతో తయారుచేశామని తెలిపారు. గతప్రభుత్వంలో చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు జ్ఞానభేరి కార్యక్రమంలో ఈ ల్యాబ్ ఏర్పాటుచేశారని అన్నారు. డ్రోన్ సాఫ్ట్ వేర్ పై దృష్టిసారించాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు. సోలార్ ఫోన్ చార్జర్, వాటర్ బాటిల్స్ వ్యర్థాలతో బ్యాగుల తయారీ, బనానా వేస్ట్ తో తయారు చేసిన శాలువా, హెర్బల్ శానిటరీ న్యాప్కిన్స్ తదితర ఆవిష్కరణలను మంత్రి లోకేష్ పరిశీలించారు. అనంతరం లైఫ్ సైన్సెస్ ల్యాబ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ను మంత్రి లోకేష్ పరిశీలించారు. 2017లో చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు ఈ ల్యాబ్ ను ప్రారంభించారని సిబ్బంది తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన టెక్నాలజీ అండ్ సాఫ్ట్ వేర్ విభాగం, జునెసిస్, పద్మావతి వర్సిటీ సంయుక్తంగా ఈ ల్యాబ్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐఐటి, ఐషర్ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల నవీన ఆవిష్కరణలు, స్టార్టప్ లకు తాము సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నామని, 40లక్షల వరకు ఈక్విటీ సాయం కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 26మందికి 3కోట్లు అందించామని, మరో 14మందికి త్వరలో ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ ను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వారు చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *