Breaking News

జగన్ ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద పెట్టారు

-చంద్రబాబు ఉపాధ్యాయుల గౌరవం నిలబెట్టారు
-ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గద్దె అనురాధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఉపాధ్యాయుల గౌరవం నిలబెడుతూనే ఉందని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వందే అన్నారు. గురువారం ఉదయం లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కాలేజీల మరియు బెంజ్ సర్కిల్ వద్ద గల గౌతమ్ డిగ్రీ కాలేజీలలోని ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ పట్టభద్రులను జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కలిసి ఆలపాటి రాజాని గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమర్థత గల నాయకుడని అటువంటి వ్యక్తి శాసనమండలిలో ఉంటే పట్టభద్రుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను కౌన్సిలింగ్ ద్వారా వారి సీనియార్టీ ప్రకారం వారు కోరిన విధంగా బధిలీలు చేయడం జరిగిందన్నారు. కానీ వైకాపా ప్రభుత్వంలో వైకాపా నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి, వైకాపా నాయకుల రికమండేషన్ ఉన్నవారికి అడిగిన చోటికి బదిలీ చేసి మిగిలిన ఉపాధ్యాయులను వేధించారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ పై సంతకం చేశారని, పట్టభద్రులైన వారికి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు. అభివృద్ధిలో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ఎక్కడ బ్రేకులు పడకుండా ఉండేందుకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు ముందు ఒకటి అంకె వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో పేరేపి ఈశ్వర్, మల్లెల రామకృష్ణలతో పాటు కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *