Breaking News

అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంజ్ సర్కిల్ నారాయణ జూనియర్ కాలేజీ ఆవరణలో నారాయణ విద్యాసంస్థల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొని ప్రశంగించారు. గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అధ్యాపకులు దాచుకున్న డబ్బులు కాజేసి, వారి బకాయిలు నిలిపివేసి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. ఆలపాటి రాజా లాయర్ గా, విద్యార్థి నాయకుడిగా, మంత్రిగా ఉన్నత స్థానానికి చేరారు. సభలో తన వాణి ఇనిపిస్తారు, cm, పవన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి చెప్పి పట్టభద్రుల సమస్యలు తీర్చగలరని తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఓటు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, పట్టభద్రుల సమస్యలు పరిస్కారం కోసం పనిచేస్తానని తనకు చక్కటి మెజార్టీ అందించాలని కోరారు. పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ శాసన మండలిలో విద్యావంతులు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకులు ఆలపాటి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్, చెన్నూపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *