Breaking News

దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్ లను సీజ్….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్ లను సీజ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమీషనర్ స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ లోని షాప్ లను పరిశీలించి, సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల్లో అద్దెకు తీసుకొని, సుధీర్ఘకాలం నుండి అద్దెలు చెల్లించని వాటిని తక్షణం సీజ్ చేయాలని, ఎన్టీఅర్ స్టేడియం కాంప్లెక్స్ లోని 5, 6 షాప్ లను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారి మదన్ గోపాల్ ని ఆదేశించారు. అలాగే కాంప్లెక్స్ లో మొత్తం షాప్ లు, అద్దె బకాయి ఉన్న షాప్ లు, ఖాళీగా ఉన్న షాప్ ల వివరాలు, నగరంలోని ఇతర ప్రాంతాల్లో కాంప్లెక్స్ ల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఖాళీ షాప్ లకు ఆక్షన్ వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యటనలో రెవెన్యూ అధికారి మదన్ గోపాల్, డి.ఈ.ఈ రమేష్ బాబు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *