గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల (MLC) ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటుకు నమోదు చేసుకున్న వారికి ఓటు వెరిఫికేషన్ కోసం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమాచార కేంద్రాన్ని(0863 – 2345103) శుక్రవారం నుండి ఏర్పాటు చేయనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకున్న వారికి నగర పాలక సంస్థ బి.యల్.ఓ లు వారి ఓటు ఎక్కడ ఉన్నది, ఓటు ఏ ఎక్కడ వేయాలి తదితర వివరాలతో కూడిన ఓటర్ స్లిప్పులను గృహాలకు వచ్చి అందజేస్తున్నారన్నారు. ఎవరికైనా ఓటర్ స్లిప్పులు అందకపోతే నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నుండి ప్రత్యేకంగా యం.యల్.సి ఎలక్షన్లకు సంబంధించి సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సదరు కేంద్రంలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయానికి రాలేని పక్షంలో కాల్ సెంటర్ 0863 – 2345103 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. కావున పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.
Prajavartha Online Telugu News