Breaking News

ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్రం పెద్ద పీట

-కేంద్ర ప్రభుత్వం చొరవపై వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రమించని వ్యాధులైన మధుమేహం, రక్తపోటు మరియు నోటి , రొమ్ము , గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు 30 ఏళ్లు పైబడిన వారికి నూరు శాతం కవరేజీని నిర్ధారించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఎన్‌సిడి స్క్రీనింగ్ డ్రైవ్‌ను ప్రారంభించడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పారదర్శకత కోసం రియల్ టైమ్ పర్యవేక్షణ ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని మంత్రి తెలిపారు. కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు రోజువారీ సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్సిడి రహిత భారత్ ను రూపొందించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి సత్యకుమార్ అభివర్ణించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *