-మినుము సాగు లాభదాయకం గా వుండే విధముగా కొత్త వంగడాలను రూపకల్పన చేసి వాటిని రైతులకు క్షేత్ర స్థాయిలో అందించాలి .
-S.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార మరియు పోషక భద్రత మిషన్ 2024-25 అంశంపై రాష్ట్ర స్థాయి కార్య శాల, విజయవాడ లో జరిగింది. ఈ కార్యక్రమములో మినుము సాగు విస్తీర్ణం ఎక్కువగా వున్న ఏడు జిల్లాల వ్యవసాయ అధికారులు, మినుము రైతులకు,రైతు ఉత్పత్తి దారుల సంఘ రైతులకు ,పప్పు మిల్లుల యజమానులు, మార్క్ ఫెడ్ , ఏ పి సీడ్స్ , ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కార్యశాల జరిగింది.
డిల్లీ రావు మాట్లాడుతూ అపరాల సాగులో మినుము సాగు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని ,మనుషుల ఆరోగ్యానికి ప్రోటీన్ ఎక్కువ ,కొలెస్టరాల్ తక్కువగా ఉండే మినుము సాగు విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదన బాగా పెంచాలని కోరారు .మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపకల్పన చేసి రైతులకు పరిచయం చేయాలని కోరారు .వ్యవసాయ ఉప సంచాలకులు బాలు నాయక్ అంతర్జాతీయ , జాతీయ & రాష్ట్ర సగటు విస్తీర్ణం ,ఉత్పత్తి ,ఉత్పాదన గణాంకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియచేశారు .
ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- లామ్ పరిశోధన శాస్త్ర వేత్తలు – దిగుబడులు పెంచటానికి కలుపు ,నీటి ,పురుగుల ,తెగుళ్ల నివారణకు ఉత్తమ ,మేలైన యాజమాన్య పద్ధతులు ఈ కార్యశాలలో తెలియచేసారు . కోత మరియు కోత అనంతర చర్యలు ,నూతన పోకడలను తెలియచేసారు.
పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.సత్యనారాయణ ,అపరాల ప్రదనశాస్త్రవేత్త డాక్టర్ మోహన రెడ్డి, కమీషనర్ కార్యాలయ వ్యవసాయ సంయుక్త సంచాలకులు కృపదాస్ ,శ్రీమతి విజయ భారతి , ఏ పి సీడ్స్ ,మార్క్ ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News