అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగర అభివృద్ధి లో అనుసరిస్తున్న విధానాలను ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది.. అక్కడి అధికారులు తీసుకుంటున్న ప్రణాళికలపై చర్చించేందుకు మంత్రి నారాయణ బృందం ముంబయి లో పర్యటించింది. గురువారం ఉదయం ముంబయి లో MMRDA(ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) అధికారులతో మంత్రి నారాయణ, సీఆర్డీఎ కమిషనర్ కన్నబాబు,ఇతర అధికారులు సమావేశమయ్యారు…MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహా ముంబయి నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడంలో MMRDA కీలక పాత్ర వహిస్తుంది.
ముంబయి లో రోడ్లు,మెట్రో రైలు,హౌసింగ్ ప్రాజెక్టులను కూడా MMRDA చేపడుతుంది…పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా రోడ్ల అభివృద్ధి,మెట్రో రైలు ప్రాజెక్టు ప్లానింగ్,రవాణా ప్రణాళికలు,ఇళ్ల నిర్మాణం ప్రణాళికాబద్ధంగా ఎలా చేపడుతుందని అంశాలను ముంబయి అధికారులు మంత్రి నారాయణ కు వివరించారు..ముంబయి మహానగరంలో విదేశీ పెట్టుబడుల సహకారంతో మౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అక్కడి అధికారులు వివరించారు…అలాగే భూములను అభివృద్ధి చేయడం ద్వారా నిధులను సమీకరిస్తున్న విధానాన్ని కూడా వివరించారు…ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ ఏవిధంగా చేస్తున్నారనే అంశాలను కూడా వివరించారు..ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి తో పాటు ఇతర నగరాలు,పట్టణాల అభివృద్ధిలో కొన్ని అంశాల్లో ముంబయి తరహా ప్రణాళికలను అమలు చేసే ఆలోచనలో ఉన్నారు..సీఎం చంద్రబాబు తో చర్చించిన తర్వాత ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి రానున్నారు.
Prajavartha Online Telugu News