-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్.బి కాలనీలో గల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఐరన్ యార్డ్, ఎట్కిన్సన్ స్కూల్ రోడ్, ఊర్మిళ సుబ్బారావు రోడ్, జోజి నగర్, గొల్లపూడి బైపాస్ రోడ్, సితార రోడ్, హెచ్ బి కాలనీ, సివిఆర్ ఫ్లైఓవర్, న్యూ భగత్ సింగ్ నగర్, బ్రహ్మయ్య స్ట్రీట్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెచ్ బి కాలనీ లోగల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ సత్వరమే మరమ్మతులు చేయించి, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిత్యం సైడ్ డ్రైనలను పరిశుభ్రపరుస్తుండాలని, ఖాళీ స్థలాలలో ఎటువంటి వ్యర్ధాలు నీటి నిల్వలు ఉండరాదని, కల్వర్ట్లు పాడైపోయినవన్నీ మరమ్మతులు చేయించాలని అధికాలను ఆదేశించారు. ఔట్ ఫాల్ డ్రైన్ లను పరిశీలించి ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ ప్రక్రియను చేస్తూ ఉండాలని అవసరమైన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.
హెచ్ బి కాలనీ లోని అన్నా క్యాంటీన్ ను పరిశీలించి, క్యాంటీన్ లో గల మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు ఆఫీసర్ పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమతులు ఉండరాదని, త్రాగునీటి సరఫరా నిరంతరం ఉండేటట్టు చూసుకోవాలి వాడుక నీటిలో ఎటువంటి లీకేజీలు ఉండరాదని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తుండాలని అన్నా క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు శివ రాంప్రసాద్, ఓబేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News