-తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస రావు మన్నె
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
2025 ఫిబ్రవరి 20న ట్రాన్స్-ఇన్స్టాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (DVOR) డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (DME)తో పాటు 240 మీటర్ల విమానాశ్రయ రన్ వే పొడిగింపు భాగం కమీషనింగ్
ఎం సురేశ్, మెంబర్ (ANS), వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభోత్సవం చేయగా AAI ఏకే గుప్తా, మెంబర్ (ప్లానింగ్) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ మద్దిల గురుమూర్తి శ్రీనివాస్ రావు మన్నె, విమానాశ్రయ డైరెక్టర్ తిరుపతి, విమానాశ్రయ సలహా కమిటీ సభ్యులు, ఇతర భాగస్వాముల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్ని ప్రాజెక్టులలో మొత్తం ఖర్చు రూ. 153.16 కోట్లు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు విమానాశ్రయ కార్యక్రమాలను మెరుగుపరుస్తాయి: డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ అండ్ డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (DME): రన్‌వే-26 కోసం కొత్త మోపియన్స్ DVOR/DME ప్రారంభించడం జరిగిందనీ తెలిపారు.
DME గరిష్ట విమానాల నిర్వహణ సామర్థ్యం రోజుకు 100 విమానాల నుంచి 200 విమానాలకు పెరుగుతుంది. ప్రాజెక్టు వ్యయం రూ. 5.61 కోట్లు.
ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS): థాలెస్ ILS, కేట్-1 రూ. 4.4 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్-ఇన్స్టాల్ చేశారు. ILS వల్ల కనీస దృశ్యమానత అవసరం 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులలో విమానాలు సజావుగా దిగడానికి వీలుగా గ్లైడ్ యాంగిల్ కూడా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గించగలుగుతున్నారు.
రన్‌వే: ప్రస్తుతమున్న 2285 మీటర్ల పొడవు గల రన్‌వేను బలోపేతం చేసి, ఇరువైపులా వరుసగా 240 మీటర్లు, 1285 మీటర్లు మేరకు పొడిగించడం జరిగిందనీ, దీని వల్ల అందుబాటులో ఉన్న రన్‌వే పొడవు 3810 మీటర్లు అవుతుంది, దీనివల్ల బోయింగ్ 777/ఎయిర్‌బస్ 330 వంటి విశాల విమానాలు తిరుపతి విమానాశ్రయంలో విజయవంతంగా దిగగలవు. భారతదేశంలో AAI (ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహిస్తున్న రన్‌వేలన్నింటిలో ఇది అత్యంత పొడవైనది. రన్‌వే విస్తరణ పనులకు మొత్తం వ్యయం రూ. 143.15 కోట్లు అని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News