Breaking News

పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు శానిటరీ సెక్రెటరీ తో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుధ్యంలో మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వ్యర్ధాలు సేకరించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్ధాల నిర్వహణ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని సేకరించిన వ్యర్ధాలను కూడా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులు చర్చించారు. డ్రోన్ల సర్వేలెన్సుల ద్వారా నగరంలో ఉన్న వ్యర్థాలను గమనించడమే కాకుండా వాటిని సత్వరమే తొలగించేటట్టు శానిటరీ సిబ్బంది ఎంతమంది చర్యలు తీసుకున్నారు ఇంకా పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, దానికి గల కరణాలు ఏంటి వంటి వాటిపై విచారించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రతి సెక్రటరీ తన పరిధిలో గల ఉన్న షాపు యజమానులకు ఖచ్చితంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడమే కాకుండా మార్చ్ 1, 2025 నుండి వారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడిన అమ్మిన చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడిందని తెలపాలని అన్నారు. ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్య బారిన పడకుండా నిరంతరం యాంటి లార్వే ఆపరేషన్లు జరుగుతుండాలని, నిత్యం ఫాగింగ్, ఎం ఎల్ ఆయిల్స్ స్ప్రే జరుగుతుండాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు.

ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రభు దాస్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, వెహికల్ డిపో ఇబఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యేసు పాదం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపి నాయక్, శానిటరీ సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *