Breaking News

నగరంలో కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కృష్ణ హాస్పిటల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మానవీయ కోణం జోడిరచి ఇక్కడికి వచ్చే వారికి సేవలు అందించాలని కోరుకుంటూ ఆసుపత్రి సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేయడంతోపాటు ఇటువంటి ఇటువంటి అధునాతనమైనటువంటి అధునాతనమైనటువంటి ప్రజలకు సేవలు అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయిలో వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇటువంటి ఆస్పత్రులను కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురై ఒకపక్క వైద్యులు మరొక పక్క యాజమాన్యం ఇక్కట్లు పడిన సందర్భాలు అనేకం చూసామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు మాసాల కాలంలో పేదలకు ప్రభుత్వ పరముగా ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేయటంతో పాటు నేడు కాలమాన పరిస్థితులలో వస్తున్నటువంటి అంతు చిక్కనటువంటి వ్యాధులకు ఇటువంటి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నైపుణ్యం కలిగినటువంటి వైద్యులు ఉండటంతో రోగులకు అన్ని రకాలైనటువంటి వైద్యాలు చేసి నయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అనేకం చూసామన్నారు. అటువంటి వైద్యశాలలలో ఈ వైద్యశాల కూడా ప్రజలందరికీ వైద్యంతోపాటు సేవలందించాలని డాక్టర్లు యాజమాన్యం నూతనంగా ఏర్పాటు చేయడం అది నా నియోజకవర్గంలో చేయటం అభినందించదగినటువంటి అంశం అని ఈ సందర్భంగా హాస్పటల్‌ యాజమాన్యానికి డాక్టర్లకు తగు సూచనలు చేస్తూ పేదలు మధ్యతరగతి ప్రజలు వివిధ వ్యాధులతో మీ దగ్గరకు వైద్యం కోసం వస్తే వారి ఆర్థిక స్థితిగతులను చూసి సహకరించాలని కోరారు. కృష్ణ హాస్పిటల్స్‌ నిర్వాహకులు మాట్లాడుతూ తమవంతుగా తమ వద్దకు వైద్యకోసం వచ్చే పేషంట్స్‌కు తమకు చేతనైనంత సాయం చేసే విధానంలో భాగంగా వైద్యసేవలు అందిస్తామన్నారు. లాభాపేక్ష లేకుండా వివిధ విభాగాలలో నిపుణులైన వైద్యులు, వైద్య బృందంచే అత్యాధునిక సాంకేతిక వైద్యసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అరిమిల్లి రాధాకృష్ణ, నగర ప్రముఖులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *