విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను ఏసిఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ,విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో వీక్షించారు. మంత్రి నారా లోకేష్,విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) టీమిండియా జెర్సీ లు వేసుకుని మ్యాచ్ ను తిలకించారు. వీరితో పాటు ఈ మ్యాచ్ ను వీక్షించిన వారిలో ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, డైరెక్టర్ సుకుమార్ వున్నారు.
Prajavartha Online Telugu News