Breaking News

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 24 సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
-కలెక్టర్ పీ.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని , ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 సోమవారం రోజున పీజీఆర్ఎస్ రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు. కావున సోమవారం ఫిబ్రవరి 24 వ తేదీ పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం పోర్టల్ నందు మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరి 27 వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లా , డివిజన్, మండల స్థాయిలో సోమవారం PGRS సెషన్‌లు రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (మార్చి 8 వ తేదీ వరకు) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు అమలులో ఉంటుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *