విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీనగర్ శ్రీ రామ ఫంక్షన్ హాల్ నందు జరిగింది, పేరం శివ నాగేశ్వరావు నేషనల్ సెక్రటరీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని నిరంతరం ప్రజల్లో తిరుగుతామని అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ బలహీన వర్గాలకు అండగా ఉంటానని తెలియజేశారు మరియు రామిశెట్టి రమేష్ ని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ కేంద్రమంత్రి రామదాసు అథవాలె ఉత్తర్వులు జారీ చేశారు అని పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ పత్రిక సముఖాన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్కా జయరాజు, ఫణింద్ర, మిరియాల వెంకట రామయ్య, బెజవాడ సాంబయ్య, రాము, సాంబశివరావు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News