Breaking News

నగరంలో మొహంతి సిల్వర్‌ ప్యాలెస్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆభరణాల ప్రియులకు నగరంలో నూతనంగా మొహంతి సిల్వర్‌ ప్యాలెస్‌ ప్రారంభమైంది. ఆదివారం ఏలూరురోడ్డులోని సీతారాంపురం, ఇన్నవోలువారి వీధిలో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, యజమాని మహంతి గౌతమి వాసుదేవరావు మాట్లాడుతూ షోరూంలో ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న వెండి ఆభరణాలను, వస్తువులను అందజేస్తున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఆభరణాలు, వస్తువులు ఇప్పుడు విజయవాడలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వెండి సామాను, మెట్టలు నుండి, కాళ్ళకు పెట్టుకునే పట్టీలు, బ్రైడల్‌ జ్యువెలరీ, తదితర వస్తువులు అధునాతన, సాంప్రదాయ డిజైన్లకు ప్రత్యేకమైన చెక్కిన డిజైనర్‌గా పేరుగాంచినది మొహంతి సిల్వర్‌ ప్యాలెస్‌ అన్నారు. అందరికి అందుబాటులో నాణ్యమైన, అత్యాధునిక డిజైన్లతో అందరినీ ఆకట్టుకునే డిజైన్లతో అందుబాటు ధరలతో నగరంలో నూతనంగా స్థాపించామన్నారు. త్వరలో మరిన్ని బ్రాంచీలతో విస్తరించి సేవలందించాలని అభిలషించారు. అంతేకాకుండా అన్ని రకాల బంగారు & వెండి ఆభరణాలను మీరు కోరిన డిజైన్‌లను సకాలంలో తయారుచేసి అందజేస్తామన్నారు. అలాగే గోల్డ్‌ & సిల్వర్‌ నెలవారీ స్కీమ్స్‌ కలదన్నారు. స్కీము కాలపరిమితి 11 నెలలు మాత్రమేనన్నారు. ఈ స్కీమ్‌లో వెయ్యి రూపాయల నుండి ప్రారంభమవుతుందన్నారు. అత్యుత్తమ పనితనం సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందినది మొహంతి సిల్వర్‌ ప్యాలెస్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు, మహంతి నరసయ్య, మహాలక్ష్మీ (మామ్‌) ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంతి వాసుదేవరావు, నగర ప్రముఖులు, ఆభరణాల ప్రియులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *