Breaking News

గవర్నర్‌ ప్రసంగం ఆసాంతం తెలుగుదేశం ఎన్నికల వాగ్ధానాలకే పరిమితం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఆసాంతం తెలుగుదేశం ఎన్నికల వాగ్ధానాలకే పరిమితమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. నేడు అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్ధానాలను మరోమారు ఉటంకించారు. ఆయా వాగ్ధానాల అమలుకోసం చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన ప్రస్తావించలేకపోయారు. తల్లికి వందనం, అన్నదాత వంటి పథకాల గురించి ప్రస్తావించారేగాని అమలు తీరు వెల్లడిరచలేదు. రైతులు ఒకవైపు మిర్చి, ధాన్యం, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితుల్లో అల్లాడుతుంటే రాష్ట్రంలో రైతాంగం సుభిక్షంగా ఉందని చెప్పారు. ఇది సాహసమే అవుతుంది. రైతులకు సమస్యలే లేవంటూ, రైతులంతా బాగున్నారంటూ ప్రభుత్వమే భావిస్తే ఇక రైతు సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుంది? అదే విధంగా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసేందుకు నిధులు లేవన్న విషయం తెలిసి కూడా పదేపదే ఎన్నికల వాగ్ధానాలను ప్రస్తావించడం ద్వారా జరిగే మేలు ఏంటో ప్రభుత్వమే చెప్పాలి.
అలాగే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశాల్లో కొత్త విధానం అమలుపరుస్తామంటూ వాటిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సరైన చర్యలు చేపట్టకుండా కొత్త ప్రాజెక్టులు ప్రకటించడం ద్వారా రైతులకు ఏ విధంగా లబ్దిచేకూరుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
అంతేగాక విజన్‌`2047 పేరుతో యువతను భ్రమల్లోకి నెడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు డిఎస్‌సిని కూడా ప్రకటించలేకపోయారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలు లేకుండా విజన్‌`2047 జపం చేయడం సరైందికాదు. మొత్తంమీద గత ఎన్నికలలో తెలుగుదేశం ఇచ్చిన వాగ్ధానాలకే గవర్నర్‌ ప్రసంగం పరిమితమైందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *