Breaking News

విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం

-పోస్టర్లను అతికించుట నిషేదం
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున బహిరంగంగా బ్యానర్లు పోస్టర్లు ఫ్లెక్సీలు అతికించడం నిషేధమని తెలిపిన నియమ నిబంధనలను అతిక్రమించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సోమవారం ఉదయం 50 వేల రూపాయల జరిమానా విధించారు.

Prevention of Disfigurement of Open Places and Prohibition of obscene and objectionable posters and advertisement Act, 1997(Act 28 of 1997) ని అనుసరించి విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున కొన్ని నియమ నిబంధనలను పాటించవలసివుంటుంది. ఇందులో భాగంగా విజయవాడ నగరం లో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిస్థితులు ద్రుష్టిలో వుంచుకొని మరియు నగర సుందరీకరణను కాపాడుకొనుటకు నగరంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భవనములు/ ప్రహరి గోడలు/ట్రాఫిక్ డివైడర్లు/ కరెంటు పోల్స్/ ట్రాఫిక్ ఇలాండ్స్ / ఫ్లైఓవర్లు/ బ్రిడ్జిలు తదితర ప్రాంతములలో పోస్టర్లను అతికించుట నిషేదం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

ఇకపై ఏదైనా సంస్థల వారు తమ ప్రకటనల నిమిత్తము వాల్ పోస్టర్లను నగరంలో పైన వుదహరించిన విదముగా ఎక్కడైనా అతికించిన యెడల వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోనబడునని, వారి వద్ద నుండి అనగా ప్రకటన దారులు/ప్రింటింగ్ ప్రెస్ వారి నుండి ఒక లక్ష రూపాయల వరుకు గరిష్ట పేనాలిటి వసూలు చేయుబడునని మరియు నగరంలో ఇప్పటికె పైన ఉదహరించిన ప్రాంతములలో పోస్టర్లను అతికించిన మరియు ప్రింటింగ్ చేసిన వారలను గుర్తించటమైనదని, వారందరిపై తదుపరి చర్యలను తెసుకోనుట మరియు క్రిమినల్ కేసులు నమోదుచేయుట జరుగుతుంది అని సదరు ప్రకటన దారులు/ప్రింటింగ్ ప్రెస్ వారికీ గమనించగలరని కమిషనర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *