Breaking News

బుడమేరు ముంపు నిధులను జిఎంసికి రీ అంబర్స్ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఏడాది సెప్టెంబర్ లో విజయవాడలో జరిగిన బుడమేరు వరదల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆహార, త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మార్గదర్శకాల మేరకు వారు తెలిపిన బృందాలకు అందించామన్నారు. అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ ఖర్చు చేసిన రూ.9.23 కోట్లకు పూర్తి వివరాలతో గుంటూరు జిల్లా కలెక్టర్  ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు. అందుకు సంబందించిన నిధుల్లో 2024,డిశంబర్ 20న రూ.3,69,18,842 నగరపాలక సంస్థ అకౌంట్ కి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్  ద్వారా నగరపాలక సంస్థకు జమ కాబడినవని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది విజయవాడలో వరదల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, త్రాగునీరు అందించడానికి గుంటూరు నగరపాలక సంస్థ నుండి రూ.9,22,97,105 ఖర్చు చేయడం జరిగిందని, సదరు ఖర్చులు తిరిగి గుంటూరు నగరపాలక సంస్థకు రీ అంబర్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2024,డిశంబర్ 12న జిఓ.ఆర్టీ.నం.77, 2025,జనవరి 20న జిఒ.ఆర్టీ.నం.13ని విడుదల చేసిందని, అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ లు కూడా జారీ చేశారని తెలిపారు. అందులో భాగంగా తొలి విడతగా 2024,డిశంబర్ 20న జిఎంసి అకౌంట్ కి రూ.3,69,18,842 జమ చేయడం జరిగిందని, మిగిలిన రూ.5,53,78,263 పేమెంట్ త్వరలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ద్వారా విడుదల కానున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *