Breaking News

త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా ఇంజినీరింగ్ అధికారులు తగిన ముందస్తు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వేసవిలో త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా ఇంజినీరింగ్ అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఉండవల్లి, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. సోమవారం కమీషనర్ ఉండవల్లి పంపింగ్ హౌస్ ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ తొలుత ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ, ఉండవల్లి పంపింగ్ కేంద్రం నుండి ప్రతి రోజు ఎంత నీరు గుంటూరు నగరపాలక సంస్థకు డ్రా చేస్తుంది, మోటార్ల కెపాసిటి, పనితీరు తదితర అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ పంపింగ్ కేంద్రం ఇన్ టేక్ వెల్ లోని 5 మోటార్లు వర్కింగ్ లోకి తీసుకురావాలన్నారు. 5 మోటార్లు రన్నింగ్ ద్వారా అవుట్ సైడ్ మోటార్లను నిలిపివేయడం జరుగుతుందని, తద్వారా నీటి వృధా తగ్గడం, విద్యుత్ ఆదా జరుగుతుందని తెలిపారు. అలాగే వేసవిలో నగరంలో త్రాగునీటి సరఫరా సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఉండవల్లి పంప్ హౌస్, తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు లేకుండా భాధ్యత తీసుకోవాలన్నారు. ఇప్పటికే రిజర్వాయర్ల వారీగా త్రాగునీటి పైప్ లైన్ల లీకుల మరమత్తులు పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. అనంతరం ఆనందపేటలో అవుట్ ఫాల్ డ్రైన్ పూడిక తీత పనులను పరిశీలించి, నూరు శాతం పూడిక తీత పనులు జరగాలన్నారు. ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు పూడికతీత పనులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ శ్రీనివాస్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు నారయణరెడ్డి, అంజిరెడ్డి,ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *