Breaking News

నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతి రోజు తినండి … ఆరోగ్యంగా ఉండండి

-జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవి కుమార్
-తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశు సంవర్థక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశు సంవర్థక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించిందని, నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతి రోజు తినండి … ఆరోగ్యంగా ఉండండనీ జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవి కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

సోమవారం రాత్రి తిరుపతి పట్టణం నందు బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు పెద్ద ఎత్తున చికెన్ మరియు కోడిగుడ్ల వినియోగంపై అవగాహన సదస్సును జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పౌల్ట్రీ ప్రముఖులతో కలిసి నిర్వహించారు. చికెన్ మరియు గుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అనంతరం వారు చికెన్ మరియు గుడ్లు తిని ప్రజల అపోహలను వీడాలని కోరారు. పెద్ద ఎత్తున ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అందరూ చికెన్ మరియు గుడ్లు తృప్తిగా తిన్నారు.

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వ్యాధితో పలు కోళ్ళు చనిపోవడం జరిగిందని, బర్డ్ ఫ్లూ వ్యాధి మన జిల్లాలో ఎక్కడ కూడా లేదని తెలిపారు. మన జిల్లాలో సుమారు 15 లక్షల కోళ్లు,22 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయని అన్నింటిని క్షుణ్ణంగా పరీక్షించామని ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు మన జిల్లాలోని కోళ్లలో లేవని, ప్రతిరోజు ఒక పశు వైద్యాధికారి పౌల్ట్రీ ఫారాన్ని తనిఖీ చేస్తున్నారని చికెన్ మరియు గుడ్లు తినడం శ్రేయస్కరమని ఎలాంటి ఆపోహలు నమ్మరాదని ప్రజలను కోరారు. చికెన్ మరియు గుడ్లు ఉడికించినవి తీసుకోవాలని ఆరోగ్యానికి మంచిదని, సురక్షితమని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో పలువురు పౌల్ట్రీ ప్రముఖులు ప్రీమియం హ్యాచరీస్, వెంకాబ్ హ్యాచరీ, బాలాజీ హ్యాచారీస్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శాఖ వారు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *