Breaking News

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసిన ఆర్.పి.ఐ (ఏ) నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని ఆయన (గుంటూరు) స్వగృహం నందు ఆర్.పి.ఐ (.ఏ) నాయకులు జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామిశెట్టి రమేష్ , కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ. మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అభ్యర్థి ఆలపాటిని అత్యధిక ఓట్ల మెజార్టీతో మండలకే పంపడం ద్వారా పట్టబద్రులు సమస్యల పరిష్కారం కావడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని, కేంద్ర మంత్రి రామదాసు అత్వాలే ఆదేశానుసారంఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు తమపార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ జనరల్ సెక్రెటరీ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీ జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల అత్యధిక ఓట్ల మెజారిటీతో మండల కి పంపిస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న భాగస్వామ్యమైన మా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్దతు ప్రకటించడం ద్వారా పట్టబద్రుల సమస్యలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని ఆయనఅన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుకి, అటు మోడీకి ఓటు వేసినట్లేనని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మక్కా జయరాజు, ఫణీంద్ర ,మిర్యాల వెంకట రామయ్య, బెజవాడ సాంబయ్య, రాము, సాంబశివరావు , పలువురు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *